సినిమా

Mahesh Babu: నందమూరి హీరోలతో మహేశ్ బాబు.. ఒకే వేదికపై..

Mahesh Babu: బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’ హిట్ లిస్ట్‌లో చేరిపోయింది.

Mahesh Babu: నందమూరి హీరోలతో మహేశ్ బాబు.. ఒకే వేదికపై..
X

Mahesh Babu: బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా 'అఖండ' హిట్ లిస్ట్‌లో చేరిపోయింది. దీంతో టీమ్ ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికే సినిమా సక్సెస్ అయినందుకు మూవీ టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వారితో అఖండ విశేషాలు పంచుకున్నారు. కానీ ఇంకా గ్రాండ్‌గా సక్సెస్ మీట్ ప్లాన్ చేయాలని అఖండ టీమ్ ఆలోచిస్తున్నారట. దానికి చీఫ్ గెస్ట్‌లను కూడా డిసైడ్ చేసేసినట్టు సమాచారం.

మహేశ్ బాబు.. ఇండస్ట్రీలోని ప్రతీ హీరోతో ఆయన క్లోజ్‌గానే ఉంటారు. మహేశ్ ఇప్పటివరకు ఎక్కువగా బుల్లితెరపై అలరించలేదు. ఆయన అవార్డ్ ఫంక్షన్స్‌కు రావడం కూడా చాలా అరుదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. స్టార్ హీరోలు సైతం, బుల్లితెరపై, ఓటీటీల్లో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందుకే మహేశ్ కూడా మనసు మార్చుకుని బుల్లితెరపై కనిపిస్తూ అలరిస్తున్నారు.

ఇటీవల ఎన్‌టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీరు కోటీశ్వరుడు'లో మహేశ్ గెస్ట్‌గా వచ్చారు. ఆ ఎపిసోడ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్‌కు సిద్ధమయ్యింది. అంతే కాక తాజాగా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'కు కూడా వచ్చి అలరించారు మహేశ్. ఇటీవల ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఈసారి ఇలా విడివిడిగా కాకుండా ఇద్దరు నందమూరి హీరోలను ఒకే వేదికపై కలవనున్నారు మహేశ్.

'అఖండ' సక్సెస్ మీట్‌కు ఛీఫ్ గెస్ట్‌లుగా మహేశ్ బాబు, ఎన్‌టీఆర్ హాజరు కానున్నారని సమాచారం. ఇప్పటికే బాలకృష్ణ నటించిన పలు సినిమాల ఈవెంట్స్‌కు హాజరయ్యారు ఎన్‌టీఆర్. ఎన్‌టీఆర్, మహేశ్ కూడా పలు సినిమాల ఈవెంట్స్‌ను కలిసి జరుపుకున్నారు. కానీ వీరి ముగ్గురిని ఒకే వేదికపై చూడొచ్చని తెలిసినప్పటి నుండి మ్యుచువల్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Next Story

RELATED STORIES