మహేష్‌ - త్రివిక్రమ్‌ మూవీ టైటిల్.. ఫ్యాన్స్ హ్యాపీ

మహేష్‌ - త్రివిక్రమ్‌ మూవీ టైటిల్.. ఫ్యాన్స్ హ్యాపీ
కొన్ని కాంబినేషన్స్ ఎదురు చూసేలా ఉంటాయి. వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుందని తెలిసి అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కొన్ని కాంబినేషన్స్ ఎదురు చూసేలా ఉంటాయి. వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుందని తెలిసి అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అని ఎదురు చూసే ప్రేక్షకులకు చిత్ర యూనిట్ నుంచి ఓ శుభవార్త అందింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న సినిమా పేరును ప్రకటించనున్నారు. ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

కొన్ని రోజులుగా గుంటూరు కారం పేరు బలంగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ కి ఉన్న అ సెంటిమెంటు మళ్లీ రిపీట్ చేయడానికి అన్నట్లు అమరావతికి అటు ఇటూ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఈ నెలాఖరుకల్లా ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. హారిక అండ్ హాసిని పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టైటిల్స్ చూసి మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story