Mahesh Babu: అప్పుడే పద్దెనిమిదేళ్లా.. ఎప్పటికీ ఇలాగే ఉందాం: మహేష్ బాబు
Mahesh Babu: టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ నమ్రత, మహేష్.. ముచ్చటైన ఈ జంట వివాహం చేసుకుని ఈ రోజుకి 18 ఏళ్లు నిండాయి. వారి బంధం మాత్రం ఎప్పటికీ ప్రెష్ గానే ఉంటుంది. భార్యా భర్తల బంధానికి అర్థం.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం.. స్టార్ హీరో అయినా ఇంట్లో ఇసుమంతైనా కనిపించదు ఆ గర్వం. అదే వారి బంధాన్ని మరింత బలపరిచింది. అకేషన్ లేకపోయినా వెకేషన్ కి వెళ్లే అలవాటున్న మహేష్.. ఇప్పుడు పెళ్లి రోజు జరుపుకునేందుకు భార్య నమ్రతతో కలిసి స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కేశారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు మహేష్.
వారి 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, నటుడు మహేష్ బాబు శుక్రవారం తన భార్య నమ్రతా శిరోద్కర్‌కు ఒక మంచి నోట్ పంపారు. వారఉ దిగిన ఫోటోలలో ఒకదాన్ని పంచుకున్నారు. "18 సంవత్సరాలు కలిసి ఉన్న మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి!" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు పలువురు అభిమానులు స్పందిస్తూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో చాలామంది క్యూట్ కపుల్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని పేర్కొన్నారు. "సంతోషకరమైన జంట. సంతోషకరమైన సెలబ్రిటీ జంటల జాబితాలో అగ్రస్థానం మీ ఇద్దరిదే. ప్రేమలో పడడం చాలా సులభం, కానీ మీరు చెప్పినట్లుగా ఎప్పటికీ అలా ఉండటం కష్టం అని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ తన సినిమా మొదటి షెడ్యూల్‌ను ముగించాడు. కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైంది. త్రివిక్రమ్‌తో తన సినిమాను పూర్తి చేసిన తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ని రాజమౌళితో ప్రారంభించనున్నాడు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com