Mahesh Babu: 'సర్కారు వారి పాట'కు సంబంధించి ఫ్యాన్స్‌కు మహేశ్ రిక్వెస్ట్..

Mahesh Babu: మహేశ్ బాబుకు యూత్‌లోనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా చాలా క్రేజ్ ఉంది. అందుకే తన సినిమాను ఫస్ట్ డే చూడాలని ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువే. అయితే చాలాకాలం తర్వాత మహేశ్ నుండి వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా కోసం ఇంతకాలం ఎదురుచూసిన తన అభిమానులు ఇంకొన్ని రోజుల్లో మహేశ్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. అయితే ఈ సందర్భంగా మహేశ్ బాబు తన ఫ్యాన్స్‌కు ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.
ఫ్యామిలీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పరశురామ్.. సర్కారు వారి పాటకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే చాలాకాలంగా మహేశ్ దగ్గర నుండి మాస్ సినిమాను ఆశిస్తు్న్న అభిమానులకు.. సర్కారు వారి పాట ఫుల్ మీల్స్ పెట్టేలా అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ కాస్త సమయంలోనే రికార్డ్ వ్యూస్ సాధించింది. అంతే కాకుండా పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు మహేశ్ ఓ లేఖ రాశాడు.
'సర్కారు వారి పాట అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న మన సర్కారు వారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు' అని పైరసీకి దూరంగా ఉండమని కోరాడు మహేశ్. అంతే కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని కూడా చెప్పేశాడు.
Superstar #MaheshBabu's letter to fans.
— Manobala Vijayabalan (@ManobalaV) May 7, 2022
Requests fans to watch #SarkaruVaariPaata only in theaters.#SSMB28 begins from June. pic.twitter.com/GHApyH47df
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com