16 Years of Pokiri : 'పోకిరి'కి 16 ఏళ్లు.. వదులుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరంటే..!

16 Years of Pokiri : పోకిరికి  16 ఏళ్లు.. వదులుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరంటే..!
16 Years of Pokiri : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో 2006లో వచ్చిన పోకిరి సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది..

16 Years of Pokiri : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో 2006లో వచ్చిన పోకిరి సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.. తెలుగు సినిమాలో అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విడుదలై నేటికి 16 సంవత్సరాలు పూర్తియింది.. ఈ సందర్భంగా సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

* బద్రి సినిమా కంటే ముందే పూరి ఈ కథను రాసుకున్నారు.

* ఈ సినిమాని రవితేజతో చేయలని అనుకున్నారు పూరి.. అయితే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా కోసం పోకిరి సినిమాని వదులుకున్నారు రవితేజ.

* ఆ తర్వాత సోనూసూద్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని చేయాలని అనుకున్నారు పూరి. కానీ మార్కెట్ లెక్కలు కుదరకపోవడంతో ఆ ఆలోచన వదులుకున్నారు.

* 'ఉత్తమ్‌ సింగ్‌.. సన్నాఫ్‌ సూర్య నారాయణ' అనే టైటిల్‌తో ఈ కథను రాసుకున్నారు పూరి... కానీ మహేష్ బాబు సలహ మేరకు టైటిల్ ని పోకిరిగా మార్చారు.

* ముందుగా హీరోయిన్ గా అయేషా టకియాని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాత్రను వదులుకుంది.

* ఆ తరవాత కంగనా రనౌత్‌ ఆ పాత్రను దక్కించుకుంది. అయితే ఈ సినిమాకి ఆడిషన్ ఇచ్చిన టైంలోనే బాలీవుడ్ చిత్రమైన గ్యాంగ్‌స్టర్‌ చిత్రానికి కూడా ఆడిషన్ ఇచ్చారు కంగానా.. అయితే రెండిట్లో సెలెక్ట్ కావడంతో పోకిరిని వదులుకున్నారు కంగనా.. విశేషం ఏంటంటే పోకిరి, గ్యాంగ్‌స్టర్‌ రెండు సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయ్యాయి. ఇందులో పోకిరి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

* అప్పుడే దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకి ఆ ఛాన్స్ వచ్చింది. రెండో సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది ఇలియానా...

* అంతకుముందు సినిమాలో ఒకే హెయిర్ స్టైల్ తో కనిపించిన మహేష్.. ఈ సినిమా కోసం జుట్టు పెంచి హెయిర్ స్టైల్ మార్చారు. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశారు. అప్పట్లో ఇవి పెద్ద ట్రెండ్ అయ్యాయి.

* సినిమా చిత్రీకరణ 70 రోజుల్లో పూర్తైంది. పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ చాలా వేగంగా చకచకా చేశారు. ముఖ్యంగా ప్రతీ షాట్ సింగిల్ టేక్ లోనే ఒకే చేసేశారు.

* రూ.10కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్‌ సాధించి ఆల్‌ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

* మగధీర చిత్రం రిలీజ్ అయ్యేవరకు ఈ సినిమా రికార్డులు అలాగే ఉండిపోయింది.

* ఈ సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో పోక్కిరి అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో వాంటెడ్ అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా పోర్కి అన్న పేరుతోనూ, బెంగాలీలో షకీబ్ ఖాన్ హీరోగా రాజోట్టో పేరిట రీమేక్ చేశారు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించినవే.

Tags

Read MoreRead Less
Next Story