టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్ లో మహేష్ కూతురు సితార

టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్ లో మహేష్ కూతురు సితార
తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో.. కూతురు సితార తండ్రికి తగ్గ తనయగా అప్పుడే పేరు తెచ్చుకుంటోంది.

తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో.. కూతురు సితార తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. అప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఈసారి ఓ జ్యువెలరీ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది.

మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో సితార వీడియోను పంచుకున్నారు. ఓ బ్యూటిఫుల్ నోట్ కూడా రాశారు. అతని కుమార్తె సితార ఘట్టమనేని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో అరంగేట్రం చేసింది. పీఎంజే జ్యువెల్స్‌కి సితార ప్రకటన కర్తగా పని చేస్తోంది. ఆభరణాల బ్రాండ్ మంగళవారం ఐకానిక్ బిల్‌బోర్డ్‌లో “సితార సిగ్నేచర్ కలెక్షన్”ని ప్రారంభించింది.

మహేష్ బాబు తన నోట్ లో ఇలా రాశారు. “టైమ్స్ స్క్వేర్‌ బిల్డిండ్ పై వెలిగిపోతున్న సితార. నీ గురించి చాలా గర్వంగా ఉంది. నీ కెరీర్ ఇలాగే వెలిగిపోవాలని కోరుకుంటున్నాను అని రాశారు. ఆ పోస్ట్‌కి రిప్లై ఇస్తూ, నమ్రతా శిరోద్కర్ రెడ్ హార్ట్ ఐ ఎమోజీలను పంచుకున్నారు. నమ్రత సోదరి, శిల్పా శిరోద్కర్ రంజిత్ మాట్లాడుతూ, “ మా పాపకు ప్రేమ పూర్వక ఆశీర్వాదాలు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను." సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ “వావ్” అని రాశాడు.

Tags

Next Story