Sarkaru Vaari Paata : 'సర్కారు వారి పాట'... టైటిల్ సాంగ్ వచ్చేసింది

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ మే 12న రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ పూర్తి కాగా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...' అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది.
తమన్ సంగీతం అందించిన ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.. హారిక నారాయణ్ పాటను ఆలపించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com