VARANASI : వారణాసికి షాకుల మీద షాకులు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న మూవీ వారణాసి. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. రాజమౌళి మూవీస్ అంటే ఓ రేంజ్ లో ఉంటాయి కదా. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ తాజాగా ఓ పెద్ద సీన్ లీక్ అయింది. గంగా నదిలో ఓ యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన సీన్ లీక్ అయింది. దీంతో మూవీ టీమ్ అంతా షాక్ లో ఉంది. నిజానికి ఇలాంటి పెద్ద సినిమాల విషయంలో రాజమౌళి చాలా ప్లానింగ్ తో ఉంటాడు. చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. షూటింగ్ లొకేషన్స్ లో సెల్ ఫోన్ అస్సలు అనుమంతించడు. అయినా ఈ మూవీ ఇప్పటికే రెండు మూడు సార్లు లీక్ అయింది.
అసలు వారణాసి ఫస్ట్ షెడ్యూల్ నుంచే లీకులు మొదలయ్యాయి. దీంతో రాజమౌళి ఈ మూవీ జాగ్రత్తల విషయంలో మూడుఅంచెల భద్రత ఏర్పాటు చేశాడు. ఈ కారణంగా ఎవరూ కనీసం సెల్ ఫోన్ తీసుకురావడం అసాధ్యం అని తేల్చారు. కానీ టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందే లీక్ అయింది. దీంతో పాటు ఆ వీడియోలోని మహేష్ బాబు లుక్స్ కూడా లీక్ అయ్యాయి. తాజగా మరోసారి పెద్ద సీక్వెన్స్ లీక్ అయింది. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరగడం మాత్రం కాస్త ఇబ్బంది కరమే అని చెప్పాలి. ఇకపైనా అయినా బలమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి లీకుల కారణంగా మూవీపై ఉన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇంకా చెబితే ఆడియన్స్ ఈ మూవీ నుంచి లీక్ లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
