గుంటూరు కారంలో ఊరమాస్ స్టెప్పులు.. శ్రీలీలతో మహేష్ లుంగీ డాన్స్..

గుంటూరు కారంలో ఊరమాస్ స్టెప్పులు.. శ్రీలీలతో మహేష్ లుంగీ డాన్స్..
X
ఇప్పటికే ‘గుంటూరు కారం’ టైటిల్‌ సాంగ్‌ ‘దమ్‌ మసాలా’ లిరిక్స్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ఇప్పటికే ‘గుంటూరు కారం’ టైటిల్‌ సాంగ్‌ ‘దమ్‌ మసాలా’ లిరిక్స్‌ అభిమానులను ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి కలంలో జాలువారిన సాహిత్యం, తమన్ చేసిన ట్యూన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఇప్పటికే ఒక రోజు పాటు చిత్రీకరించబడిన ఈ మాస్ సాంగ్‌లో, మహేష్ లుంగీ, షర్ట్‌లో కనిపిస్తుండగా, శ్రీలీల హాఫ్-చీర తరహా కాస్ట్యూమ్‌లో కనిపిస్తుంది. విజువల్స్ చూసిన వారు మహేష్ డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశారని, శ్రీలీల తన గ్లామర్ కు డ్యాన్స్ మూవ్ మెంట్ ను జోడించిందని అంటున్నారు. ఈ పాటతో థమన్ మరో మెట్టు పైన ఉంటాడని అంటున్నారు.

ఇటీవలి కాలంలో, మహేష్ మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు), మా మా మహేశ (సర్కారు వారి పాట) వంటి మాస్ పాటలలో కనిపించాడు. ఇప్పుడు తన తాజా చిత్రం గుంటూరు కారం నుండి వచ్చిన ఈ కొత్త పాట వాటన్నింటి కంటే డబుల్ బొనాంజాగా ఉండబోతోందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ (సితార ఎంటర్‌టైన్‌మెంట్) నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags

Next Story