మాస్ లుక్ లో మహేష్.. పుట్టినరోజు స్పెషల్ పోస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం 'గుంటూరు కారం'. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ విశేషమైన ఉత్కంఠను సృష్టించింది. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని సినిమా విడుదల తేదీలో మార్పును తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం జనవరి 12, 2024న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పోస్టర్‌లో మహేష్ బాబు లుంగీ ధరించి, బీడీ తాగుతూ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతని మునుపటి పాత్రలకు భిన్నమైన శైలిలో ఈ చిత్రలోని పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
సినీ ప్రేక్షకులు,మహేష్ అభిమానుల కోసం టాలీవుడ్ డైనమిక్ ద్వయం సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ రాబోయే మాస్టర్ పీస్ ' గుంటూరు కారం ' కోసం మరోసారి చేతులు కలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు ట్రీట్‌గా ఆకర్షణీయమైన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com