Major Movie Review: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 'మేజర్'.. అడవి శేష్ అద్భుత నటన

Major Movie Review: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్.. అడవి శేష్ అద్భుత నటన
Major Movie Review: నటులు, క్రీడాకారులు, రాజకీయనాయకులు.. ఎవరిదైనా బయోపిక్ తీస్తే ప్రేక్షకులు ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడతారు.

Major Movie Review: మేజర్ సందీప్ ఉన్నికిషన్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరునిగా దేశానికి తెలుసు. కానీ అతని జీవితం ఎలామొదలైంది..? 26/11 ఎటాక్ తర్వాత దేశం మొత్తం వినిపించిన సందీప్ జీవితంలో ఏం కోల్పాయాడు..? ఏం సాధించాడు..? అదే మేజర్ కథ.. గూఢాచారి తో దర్శకుడిగా పరిచయం అయిన శశికిరణ్ తిక్క తో కలసి అడివిశేష్ తెరమీదకు తెచ్చిన ఈ రియల్ హీరో కథ ఎలా ఉందో చూద్దాం..

కథ:

సందీప్ ఉన్ని కిషన్ ఒక ఎన్ ఎస్ జి కామెండో గా 26/11 దాడులలో తాజ్ లో చిక్కుకున్న బంధీలను విడిపించే ప్రయత్నంలో ప్రాణం త్యాగం చేసిన హీరోగా తెలుసు. కానీ అంతంటి త్యాగం వెనుక అతని వ్యక్తిత్వం ఎంటి..? అతని బాల్యం నుండి నాటుకున్న బలమైన ఎమోషన్స్ ఏంటి..? అతను ఎలా ఉండాలని ఇష్టపడ్డాడు..? అతను ఏం కోల్పోయాడు అనేది ఈ సినిమాతో తెలుసుకున్న కథ..

కథనం:

బలమైన త్యాగాల వెనుక అంతకంటే బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. అది ఒక సంఘటనతో నిర్మాణం అవుతుందని చెప్పలేం.. అలాంటి వ్యక్తిత్వమే సందీప్ ది. చిన్న తనం నుండి ఎదుటి వారి కష్టాలను చూసి వారికి అండగా నిలబడటం అలవాటుగా మారిన సందీప్ క్యారెక్టర్ ని తెరమీద అంతే హృద్యంగా మలిచాడు దర్శకడు శశికిరణ్ తిక్కా. సందీప్ జీవితం ని తన నటనతో మ్యాచ్ చేసాడు అడివిశేష్. అతను సిన్సియర్ గా ఉంటాడు ప్రేమలో అయినా పనిలో అయినా.. గెలవడం అనేది తనకు సంబంధించిన విషయంగా చూడడు అది టీం కి సంబంధించినదిగా చూస్తాడు.

ఈ లక్షణాలు సందీప్ ని అతని టీం లో ప్రత్యేకంగా నిలిపాయి. ఈ సినిమాలో కొందరి సైనికుల మరణ వార్త వింటున్న సందీప్ వారికి గౌరవార్ధంగా మోకాళ్ళ పై కూర్చుంటాడు. అందరూ అతన్ని ఫాలో అవుతారు. అలాంటి సన్నివేశాలతో 26/11 ఎటాక్ ఎపిసోడ్ మొదలవకముందే సందీప్ పాత్రలో ప్రేమలో పడేలా చేసాడు శేష్. ఇది ఒక ప్రత్యేకమైన వ్యక్తి కథ. అతని జీవితం ఒక సందేశంలా కనిపిస్తుంది. ఒక గొప్ప సైనికుడు జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అవి అంతే నిజాయితిగా తెరమీదకు తెచ్చాడు దర్శకుడు శశికిరణ్. అతని వైవాహిక జీవితం సరిగా ఉండదు.

అతనికి ప్రేమలేక కాదు. చూపించే టైం లేక.. ఈ లైన్ ని తెరమీదకు చాలా బాగా తీసుకొచ్చాడు దర్శకుడు. అదే సందీప్ పాత్రపై మరింత ప్రేమను పెంచుతుంది. ఇక 26/11 ఎటాక్ లు స్టార్ట్ అయ్యాక తాజ్ లో కి సందీప్ టీం ఎంటరవుతుంది. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ఆ క్షణం అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎలాంటి క్లూస్ లేని టైం లో ఒక కమాండర్ చూపిన తెగువ చాలా మంది ప్రాణాలను కాపాడింది. అతని నాయకత్వం లక్షణాలు, త్యాగాలు టీం ని ఎలా ముందుకు నడిపాయి. అనేది ఉత్కంఠ భరితంగా సాగాయి.

శోభితాను రిస్క్ చేసి కాపాడే సీన్ మేజర్ కి హైలెట్ నిలుస్తుంది. చరిత్రలో కొన్నిపాఠాలు చదివే టప్పుడు కొందరి త్యాగాలు గుర్తుకు వస్తాయి. ముంబై లు జరిగిన ఉగ్రవాదలు ఎటాక్ లో కాపాడిన ప్రాణాలు వెనుక సందీప్ ఉన్ని కిషన్ వంటి వీరుల ఉంటారు. అడివిశేష్ పాత్రను చాలా శ్రర్ధగా చేసాడు. అతని ఎమోషన్స్ ని చాలా రియలిస్టిగా తెరమీదకు తెచ్చాడు.

మేజర్ సందీప్ ఉన్నికిషన్ కి భారత ప్రభుత్వం ఇచ్చిన అశోక్ చక్ర తో పాటు మేజర్ సినిమా కూడా సమానమైన గౌరవంగా నిలబడుతుంది. క్షణం నుండి చేస్తున్న ప్రతి సినిమా అంచనాలకు మించి ఉంటుంది. అడివిశేష్ తన ప్రయాణం ని సరైన దిశగా పరుగులు తీయిస్తున్నాడు. మేజర్ తో అతని కెరియర్ గేర్ అప్ అయ్యింది. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన నేపథ్య సంగీతం బాగుంది. ప్రకాష్ రాజ్ , రేవతిల నటన సినిమాకు పెద్ద బలంగా మారింది. దేశ భక్తి సినిమాలు చాలా చూసాము కానీ మేజర్ మాత్రం చాలా ప్రత్యేకం.

చివరిగా:

ఒక గొప్ప వ్యక్తి ని పరిచయం చేసిన సినిమా. మేజర్ గా అడివిశేష్ నటన ఎప్పటికీ గుర్తిండిపోతుంది. దేశభక్తి, యాక్షన్ ఫర్ ఫెక్ట్ గా బ్లెండ్ అయిన మేజర్ ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ లు ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతాయి.

Tags

Read MoreRead Less
Next Story