Major Movie : నెట్ ఫ్లిక్స్ టాప్ 10లో మేజర్ సినిమా..

Major Movie : 26/11 ముంబయి దాడులు, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చి సినిమా మేజర్. థియేటర్లో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ అదరగొడుతుంది. మేజర్ సినిమా ఇంగ్లీష్ సబటైటిల్స్‌తో ఉండడంతో పాకిస్థాన్, సింగపూర్, ఖతార్, శ్రీలంక, మలేషియాతో పాటు 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో నిలిచింది. మేజర్ సినిమా సక్సస్ కావడం స్పూర్థిదాయకం అని అడవి శేష్ అన్నారు. మేజర్ మూవీతో అడవిశేష్ బాలీవుడ్ ఎంట్రీ విజయవంతమైందని చెప్పుకోవచ్చు.
శశి కిరణ్ టిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు నమ్రతా శిరోడ్కర్ కలిసి నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చగా.. వంశి పచ్చిపులుసు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవిశేష్, ప్రకాశ్ రాజ్, శోభితా దూలిపాల, సయి మంజ్రేకర్ ప్రధాన పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com