Vikram Cobra : ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించిన విక్రమ్ 'కోబ్రా' మూవీ..

Vikram Cobra : విక్రమ్ 'కోబ్రా' సినిమా వినాయక చవితి నాడు రిలీజ్ అయి థియేటర్లలో అద్భుతంగా దూసుకుపోతోంది. అయితే ఎడిటింగ్ సరిగ్గా జరగలేదని ఎక్కువ రివ్యూస్ వచ్చాయి. దీనిని కోబ్రా మేకర్స్ పరిగణలోకి తీసుకొని మొత్తం సినిమాలోంచి 20 నిమిషాల సీన్లను తొలగించారట. ఈ రీఎడిటెడ్ మూవీ ఈ రోజులో సాయంత్రం నుంచి అన్ని థియేటర్లలో అందుబాటులోకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
మ్యాథమెటిక్స్ స్కాలర్‌గా విక్రమ్ ఇందులో 10 క్యారెక్టర్లలో కనిపించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అజయ్ జ్ఞానముత్తు దీనికి దర్శకత్వం వహించారు. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఎస్.ఎస్. లలిత్ కుమార్ సెవెన్ స్ర్రీన్ స్టూడియో బ్యానర్‌పై నిర్మించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పథాన్ ఇందులో మెయిన సపోర్టింగ్ రోల్ ప్లే చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com