Malaika Arora: మాజీ భర్తతో మలైకా.. కుమారుడి కోసం..

Malaika Arora: బాలీవుడ్ సెక్సీయెస్ట్ సుందరి మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి డిన్నర్‌కు బయల్దేరింది. మలైకా, అర్బాజ్ విదేశాలలో ఉన్నత చదువులు చదువుతున్న తమ కుమారుడు అర్హాన్‌కు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెలవుల నిమిత్తం అతడు ముంబైలో ఉన్నాడు.
మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ 19 సంవత్సరాల వివాహం జీవితం కొనసాగించారు. ఆ తరువాత వారు 2017లో విడాకులు తీసుకున్నారు. మలైకా ఇటీవల రాజస్థాన్‌లోని రణథంబోర్ నుండి తిరిగి వచ్చింది, అక్కడ ఆమె ప్రియుడు అర్జున్ కపూర్‌తో కలిపి ఎంజాయ్ చేసింది.
ఇటీవల తన జీవితం ఆధారంగా మూవింగ్ ఇన్ విత్ మలైకా అనే రియాలిటీ సిరీస్‌లో నటించింది. తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో తన ఈక్వేషన్ గురించి మాట్లాడుతూ, "అతను అద్భుతమైన వ్యక్తి. అతను నన్ను ఈ రోజు ఉన్నత వ్యక్తిగా మార్చాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం అతడే అనిపిస్తుంది.
మలైకా అరోరా అర్బాజ్ ఖాన్‌తో విడిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి కూడా మాట్లాడింది. నేను జీవితంలో భిన్నమైన విషయాలను కోరుకుంటున్నాను. ఎక్కడో అది తప్పిపోయిందని భావించాను. నేను ముందుకు సాగాలి. కొన్ని బంధాలను వదులుకోగలిగితేనే నేను అది చేయగలను అని భావించాను.
మేము ఒకరినొకరు ప్రేమించుకుంటాము, గౌరవించుకుంటాము. మేము కలిసి ఒక బిడ్డకు జన్మనిచ్చాము. ఇదంతా ఎప్పటికీ మారని విషయం. ఇద్దరికీ కొన్ని విషయాల్లో అవగాహన లోపించి ప్రతికూల వ్యక్తులుగా మారాము అని తాను అర్భజ్ ఖాన్‌తో విడిపోవడం గురించి వివరించింది మలైకా.. ఏమైనా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లుగా అనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com