Malaika Arora : అర్జున్ కపూర్ తో మలైకా బ్రేకప్

Malaika Arora : అర్జున్ కపూర్ తో మలైకా బ్రేకప్
X
బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ కు గుడ్ బై చెప్పిన మలైకా అరోరా

బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి కారణం మరో నటి అనే పుకార్లు కూడా వినిపిన్నాయి. కొంత కాలంగా కలిసి జీవిస్తున్న ఈ లవ్ కపుల్ అర్జున్‌కపూర్, మలైకా అరోరా మధ్య ఇప్పుడు సంబంధం తెగిపోయిందనే వార్త సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతే కాదు కొన్ని రోజుల క్రితం నుంచి వారు విడివిడిగా ఉంటున్నారనే వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిక్కారణం మలైకా అరోరా రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టే. అర్జున్‌ కపూర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ని అన్‌ఫాలో చేయడం వల్లే తాజాగా ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో వీళ్లిద్దరి లవ్ బ్రేకప్ అయిందని తెలుస్తోంది.

అర్జున్‌ కపూర్ నిర్మాత బోనీకపూర్ కొడుకు. 37ఏళ్ల ఈ కుర్ర హీరో 49సంవత్సరాల వయసున్న మలైకా అరోరాతో డేటింగ్ చేస్తూ వచ్చాడు. ఇద్దరూ కలిసి జీవించడం, కలిసి పార్టీలు, ఫారిన్ టూర్‌లకు కూడా అటెండ్ అయ్యారు. అంతే కాదు వారు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్త కూడా అప్పట్లో వైరల్ అయింది. మలైకా అరోరా, అర్జున్‌కపూర్‌కి మధ్య ఏజ్ గ్యాప్ 12ఏళ్లు ఉన్నప్పటికి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసి తిరిగారు. కానీ సడన్‌గా మలైకా అర్జున్‌ కపూర్‌ని అన్‌ఫాలో చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మలైకా గతంలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు అర్హాన్ అనే 16 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని విభేదాల కారణంగా 2017లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.. ఆ తర్వాత మలైకా అరోరా అర్జున్ కపూర్ కలిగి తిరిగారు. నాలుగైదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరి రిలేషన్‌పై అటు కుటుంబ సభ్యుల్లో..ఇటు ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది. ఇంత పెద్ద వయసు ఉన్న నటితో ప్రేమ, పెళ్లి ఏంటని అర్జున్‌ కపూర్‌ని విమర్శించారు. అయినా సరే వారిద్దరూ కలిసే తిరిగారు. ఆ ట్రోల్స్ ను ఏం పట్టించుకోలేదు, రీసెంట్‌గా అర్జున్ కపూర్ కూడా ఇటీవల ఒంటరిగా తిరుగుతూ కనిపించడం సహజంగానే అనుమానాలు రేకెత్తిస్తోంది.

దీనికి తోడు మలైకా అరోరా కూడా ఏ పార్టీకి వెళ్లినా ఈమధ్య కాలంలో ఫోటోషూట్‌లు, పార్టీలు, వెకేషన్ ట్రిప్స్ అన్నింటికీ సింగిల్‌గానే వెళ్తోంది. ఆ ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అయితే అర్జున్‌ కపూర్, మలైకా అరోరా లవ్ బ్రేకప్ వెనుక పెద్ద కారణమే ఉందని బాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. రీసెంట్‌గా అర్జున్ కపూర్ కుషా కపిలా అనే నటి వెంటపడుతున్నాడని అందుకే మలైకా దూరం పెట్టిందని కూడా వార్తలొచ్చాయి. మలైకా అరోరాతో అర్జున్‌ కపూర్‌ బ్రేకప్ వార్త బయటకు రావడంతో నటి కుషా కపిల లవ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నటి.. ప్రతిరోజూ తన గురించి చాలా అర్ధంలేని విషయాలను చదవాల్సి వస్తోందని కామెంట్ పెట్టింది. గత కొన్ని రోజులుగా మలైకాతో అర్జున్ కపూర్ దూరంగా ఉంటున్నాడని అందుకు నటి కుషా కపిలాతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై ఎవరూ బహిరంగంగా స్పందించలేదు. అయితే ఇప్పుడు మలైకా అరోరా బ్రేకప్ పుకార్ల మధ్య సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్ కుటుంబ సభ్యులను అన్‌ఫాలో చేసింది. దాంతో వీళ్లిద్దరి లవ్ స్టోరీ ముగిసిందని..అర్జున్ కపూర్ నటి కుషా కపిల వెంటపడుతున్నాడని తెలుస్తోంది. మలైకా మొదట అర్జున్‌కపూర్‌ తండ్రి, సిస్టర్స్‌ని అన్‌ ఫాలో చేసింది. అతన్ని ఫాలో అవుతోంది. అయితే సోషల్ మీడియాలో వార్త దుమారం రేపగానే అర్జున్‌ కపూర్‌ని కూడా రీసెంట్‌గానే అన్‌ఫాలో చేసింది.


Tags

Next Story