Malaika Arora: 'నేను అవన్నీ పట్టించుకోను'.. రిలేషన్‌షిప్‌పై మలైకా కామెంట్స్..

Malaika Arora (tv5news.in)

Malaika Arora (tv5news.in)

Malaika Arora: తరచుగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.

Malaika Arora: విడాకుల తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ దీన్ని కూడా కొందరు నేరంగా భావిస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు విడాకులు తీసుకున్న తర్వాత మరొకరితో ప్రేమలో పడకూడదు అన్నట్టుగా నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిపై తాజాగా స్పందించింది బాలీవుడ్ నటి మలైకా అరోరా.

మలైకా వయసు 48 ఏళ్లు. కానీ ఇప్పటికీ యంగ్ బ్యూటీలతో పోటీపడే అందాన్ని మెయింటేయిన్ చేస్తోంది. అయితే ముందుగా మలైకా.. బాలీవుడ్ హీరో, సల్మా్న్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరు 18 ఏళ్లు కలిసున్న తర్వాత పలు కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటినుండి యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది మలైకా.

అర్జున్ కపూర్ వయసు 36 ఏళ్లు. అంటే ఇద్దరికీ 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. దీంతో తరచుగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. దీనిపై వీరిద్దరు పలుమార్లు స్పందించారు. అయినా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన మలైకాకు మరోసారి ఇదే ప్రశ్న ఎదురయ్యింది. దీంతో తాను ఘాటుగా స్పందించక తప్పలేదు.


మన సమాజంలో వయసులో చిన్న వాడితో డేటింగ్ చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు మలైకా. తను వాటిని పట్టించుకోనని స్పష్టంగా చెప్పేశారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ఇది అందరూ గుర్తించాలి అంటూ క్లారిటీ ఇచ్చేసింది. కొన్నాళ్ల క్రితం మలైకా, అర్జున్ బ్రేకప్ అయ్యారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఈ ఇద్దరూ వాటి గురించి పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చేశారు.

Tags

Read MoreRead Less
Next Story