Malavika Mohanan : రొమాంటిక్ సీన్స్ చేయడం ఈజీ కాదు : మాళవికా మోహనన్

కేరళ బ్యూటీ మాళవికా మోహనన్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘యుధ్రా’. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు రవి ఉద్యావర్ తెరకెక్కించాడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాలో పలు ఇంటిమేట్, లిప్ లాక్ సీన్లలో నటించింది మాళవిక. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక ఇంటిమేట్ సీన్స్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. "ప్రతి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు సెట్‌లో ఇంటిమేట్ కో-ఆర్డినేటర్ ఉంటారు. కానీ యుధ్రా సినిమాకు లేరు. సాథియా సాంగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఆ పాటలో చాలా రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. సముద్రం తీరంలో చలి ఎక్కువగా ఉండేది. నేను సిద్దాంత్ చాలా కంగారుపడ్డాం. చివరకు డైరెక్టర్ చెప్పినట్టు చేశాం. నిజానికి ఇంటిమేట్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు" అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com