Malavika Sundar Marriage : తన కంటే చిన్నవాడిని పెళ్లాడిన ప్లే బ్యాక్ సింగర్

Malavika Sundar Marriage : ప్రేమకి వయసుతో సంబంధం లేదని రుజువు చేసింది ప్లే బ్యాక్ సింగర్ మాళవిక సుందర్... తాజాగా ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఎంటర్‌ప్రెన్యూర్ అశ్విన్ కశ్యప్ రఘురామన్‌తో ఆమె వివాహం జరిగింది. మాళవిక కంటే అశ్విన్ కశ్యప్ వయసులో చిన్నవాడు కావడం గమనార్హం.. కాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మాళవిక విషయానికి వచ్చేసరికి తమిళ సూపర్ సింగర్ షోలో ప్లే బ్యాక్ సింగర్‌గా అలరించింది. ఈమె తెలుగులో కూడా దాదాపుగా 200 పాటలు పాడింది. ఇక పెళ్లికి వయసుతో పని లేదని, ఇద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకుని, గౌరవించుకుంటే అంతే చాలని చెపుతూ.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అభిమానులకి హింట్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com