KPAC Lalitha : లెజండరీ నటి కన్నుమూత..!

KPAC Lalitha : మలయాళీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. లెజండరీ నటి కేపీఏసీ లలిత కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 74సంవత్సరాలు.. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆమె మలయాళం, తమిళంలో 550 చిత్రాలకు పైగా నటించింది. కేపీఏసీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.
అదే ఆమెకి ఇంటి పేరుగా మారింది. ఆమె నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటుగా ఉత్తమ సహాయ నటిగా రెండు నేషనల్ అవార్డులను గెలుచుకుంది. 1999లో 'అమరమ్'లో, 2000లో 'శాంతం' పాత్రలకు గాను జాతీయ అవార్డు లభించింది. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను లలిత వివాహం చేసుకున్నారు. లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ ఉన్నారు.
కేరళ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లపాటు లలిత బాధ్యతలు నిర్వహించారు. కాగా లలిత మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా ఆమె చేసిన సేవలను పినరయి గుర్తుచేసుకున్నారు.
Rest in peace Lalitha aunty! It was a privilege to have shared the silver screen with you! One of the finest actors I've known. 🙏💔#KPACLalitha pic.twitter.com/zAGeRr7rM0
— Prithviraj Sukumaran (@PrithviOfficial) February 22, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com