సినిమా

Ambika Rao: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటి మృతి

Ambika Rao: మలయాళీ నటి అంబికా రావు కుంబళంగి నైట్స్‌ చిత్రంలో ఇద్దరు కూతుళ్లకు తల్లిగా చేసిన పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

Ambika Rao: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటి మృతి
X

Ambika Rao: కుంబళంగి నైట్స్ ఫేమ్ నటుడు, సహాయ దర్శకురాలు అంబికారావు సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 58 ఏళ్ల అంబికకు ఇటీవల కోవిడ్ సోకడంతో ఎర్నాకులంలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

అంబికా రావు కుంబళంగి నైట్స్ , వైరస్ , అనురాగ కరికిన్వెల్లం, మీషా మాధవన్ వంటి ప్రముఖ చిత్రాలలో సహాయ పాత్రల్లో నటించారు. ఆమె బాలచంద్ర మీనన్ చిత్రం కృష్ణ గోపాలకృష్ణతో సహాయ దర్శకురాలిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.

ఆమె రాజమాణిక్యం, సాల్ట్ అండ్ పెప్పర్, వెల్లి నక్షత్రం, తొమ్మనుమ్ మక్కలుం వంటి చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు. త్రిస్సూర్‌లోని తిరువంబాడి దేవాలయం సమీపంలో నివాసం ఉండే ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Next Story

RELATED STORIES