Aparna Nair : మలయాళ నటి మృతికి ఆమె భర్తే కారణమా..?
మలయాళ నటి అపర్ణ నాయర్ ఆగస్టు 31న కేరళలోని తిరువనంతపురంలోని కరమనలోని తన ఇంట్లో శవమై కనిపించింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ప్రకారం అపర్ణ సోదరి తన భర్త మితిమీరిన మద్యపానం, అజ్ఞానం తనను ఈ తీవ్ర చర్యకు పాల్పడేలా చేసిందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అపర్ణా నాయర్ మలయాళ సినిమాలు, టీవీ షోలలో నటించింది. ఈ క్రమంలో ఆమె మృతి సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
సీరియల్ యాక్టర్ అపర్ణ నాయర్ మృతికి ఆమె భర్తే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, తన భర్త మితిమీరిన మద్యపానం, ప్రవర్తన కారణంగా ఆమె మానసికంగా ఎంతో వేదనకు గురై, ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆమె సోదరి ఫిర్యాదు చేసింది. ఆమె అపస్మారక స్థితిలో పడి ఉందని ఆమె తల్లి తనకు తెలియజేసిందని, వారు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించిందని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
తన భర్త సంజిత్ తనను తీవ్ర మానసిక హింసకు గురిచేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రాంతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపణలన్నింటినీ ఖండించారు. తమ మధ్య ఎలాంటి సమస్య లేదని, సంతోషంగా జీవిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో సంజిత్‌పై వచ్చిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మలయాళ నటి అపర్ణా నాయర్ ఆగష్టు 31న రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కరమనలోని తలియిల్‌లోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆమె వయసు 33. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె మృతిపై ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి సమాచారం అందింది. ఇంట్లో మృతదేహం లభ్యం కావడంతో బాడీని ఆస్పత్రికి తరలించారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె 'చందనమజ', 'ఆత్మసఖి' మొదలైన టీవీ సీరియల్స్‌తో ప్రసిద్ధి చెందింది, కొన్ని చిత్రాలలో కూడా పలు పాత్రలు చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com