Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ

Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ
X

‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్‌ స్టార్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మమిత బైజు. ఈ సినిమాలో తన క్యూట్ నటనతో కుర్రకారును కట్టిపడేసింది. దాంతో అమ్మడుకు సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల్లో ఫుల్ పాపులారిటీ వచ్చింది. వరుస అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ఈక్రమంలోనే ‘డియర్ కృష్ణ’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా సినిమాలో మమిత పాత్రకు సంబందించిన లుక్ విడుదల చేశారు మేకర్స్. లంగా వోణీలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న మమిత ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డియర్ కృష్ణ సినిమాను కొత్త దర్శకుడు దినేష్ బాబు తెరకెక్కిస్తుండగా అక్షయ్ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్య ఉల్లాస్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పీఎన్‌బీ సినిమాస్‌ బ్యానర్‌పై దినేష్ నిర్మించనున్నారు. దీంతో మమిత తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story