Siddique : `గాడ్‌ఫాద‌ర్` డైరెక్టర్ కు గుండెపోటు.. ప‌రిస్థితి విష‌మం

Siddique : `గాడ్‌ఫాద‌ర్` డైరెక్టర్ కు గుండెపోటు.. ప‌రిస్థితి విష‌మం
సినీ ఇండస్ట్రీని వెండాడుతున్న గుండెపోటు ప్రమాదాలు.. స్టార్ డైరెక్టర్ పరిస్థితి విషమం

కరోనా తర్వాత ఎక్కడ చూసినా గుండెపోటు వార్తలే కనిపిస్తున్నాయి. అప్పటివరకూ బాగానే ఉండి, క్షణంలో గుండెనొప్పి వచ్చి ప్రాణాలు వదులుతుండడం ఆందోళనకరంగా మారింది. సినిమా ఇండస్ట్రీలోనూ ఇటీవలి కాలంలో ఈ తరహా వార్తలు ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్యే నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త చనిపోగా.. ఆ తర్వాత ఇటీవలే హీరో పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి చెందిన మరో నటి స్పందన గుండెపోటుతో సడెన్ గా మృతి చెందారు. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ సిద్దిఖీ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ టాపిక్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సిద్ధిఖీ.. మళయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు తీశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన.. లాల్ అనే యాక్టర్ కమ్ డైరెక్టర్ తో చాలా సినిమాలు తీశారు. అన్నింటికంటే ముఖ్యంగా 'రామ్ జీ రామ్ స్పీకింగ్', 'ఇన్ హరిహర్ నగర్', 'గాడ్ ఫాదర్', 'వియత్నాం కాలనీ', 'కాబూలీ' వాలా లాంటి మలయాళ సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.

ఇక తెలుగులో సిద్దిఖీ తీసిన సినిమా విషయాలకొస్తే.. హీరో నితిన్ తో కలిసి 'మారో' అనే సినిమాను రూపొందించారు. కాకపోతే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంత బాగా ఆడలేకపోయింది. ఆ తర్వాత ఆయన ఇంకెలాంటి తెలుగు సినిమా చేయలేదు. కేవలం డైరెక్టర్ గానే కాకుండా సిద్దిఖీ.. పలు సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ కనిపించారు. పలు టీవీ షోల్లో జడ్జిగానూ చేశారు. చివరగా మోహన్ లాల్ తో బిగ్ బ్రదర్ అనే సినిమా చేశారు. ఈ మూవీ 2020లో రిలీజైంది.

ఇక తాజాగా సిద్ధిఖీ ఆస్పత్రిపాలవడంతో.. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో.. సిద్దిఖీ త్వరగా కోలుకోవాలని, మునుపటిలా మళ్లీ మన ముందుకు రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story