Kotabommali PS: మళయళ రీమేక్ లో హీరో శ్రీకాంత్...

Kotabommali PS: మళయళ రీమేక్ లో హీరో శ్రీకాంత్...
మరోసారి పోలీసు పాత్రతో రాబోతున్న హీరో శ్రీకాంత్

హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ సినిమాకు మేకర్స్ తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు 'కోట బొమ్మాళి .. పీఎస్' అనే పేరును ఖరారు చేశారు. అంటే ఈ మూవీ అంతా కూడా 'కోట బొమ్మాళి' లోని పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందన్నమాట. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ మోషన్ పోస్టర్ ను కూడా వదిలారు.

గీతా ఆర్ట్స్ 2 నుంచి రాబోతున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి గతంలో జోహార్, అర్జున ఫాల్గుణ చిత్రాలను రూపొందించిన తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మోషన్ పోస్టర్ విషయానికొస్తే.. పరారీలో ఉన్న కోట బొమ్మాళి పోలీసులు అనే టెక్ట్స్ తో ప్లయర్ తో స్టార్టవుతుంది. రాజకీయాలు, పోలీసు బలగాలకు సంబంధించిన తుపాకులు, బ్యాలెట్ పేపర్లు, కరపత్రాలతో సహా మరెన్నీ ప్రదర్శిస్తోంది. మొత్తానికి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక 'కోట బొమ్మాళి .. పీఎస్' సినిమా విషయానికొస్తే.. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని.. ఈ ముగ్గురూ కూడా పోలీస్ పాత్రల్లోనే కనిపించనున్నారు. 2021 ఏప్రిల్లో మలయాళంలో వచ్చిన 'నయట్టు' సినిమాకి ఇది రీమేక్. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో అక్కడ పెద్ద హిట్ కొట్టిన సినిమా అది. జోజు జార్జ్ .. కుంచకో బోబన్ .. నిమిషా సాజయన్ అందులో ప్రధానమైన పాత్రలను పోషించారు.

ఒక రోడ్డు యాక్సిడెంట్ ను పోలీసులే కావాలని చేశారనే అనుమానాలు బలపడతాయి. తమని అరెస్టు చేస్తారని భయపడిన ఆ ముగ్గురు పోలీసులు పారిపోతారు. వాళ్లని పట్టుకోవడానికి మిగతా డిపార్టుమెంట్ రంగంలోకి దిగుతుంది. ఇలా పోలీసులను పోలీసులే వెంటాడే ఒక ఆసక్తికరమైన కథ ఇది. ఈ ముగ్గురు పోలీసులను భయంతో పరుగులు తీయించే ఆఫీసర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.



Tags

Read MoreRead Less
Next Story