ఇండస్ట్రీలో విషాదం.. మృత్యువుతో పోరాడి ఓడిన నటి
కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తునేవుంది. దేశంలోనూ కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విరుచుపడింది. ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. ప్రముఖ నటి శరణ్య అనారోగ్యంతో కన్నూ మూసింది. పదేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతూ వచ్చిన నటి శరణ్య.. ఈ మధ్యే కరోనా సోకింది. చివరకు కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఇతర సమస్యలు తలెత్తడంతో శరణ్య శశి(35) చివరి శ్వాసను వదిలారు. కేరళ త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం(ఆగస్టు9)న తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి మంత్రకోడి, సీత మరియు హరిచందనం సహా పలు మలయాళ టీవీ సిరియల్స్‌తో బాగా పాపులరైంది. శరణ్య పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది. అయితే ఆమెకి పదేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో అప్పటి నుంచి శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శరణ్యకు పరిశ్రమలోని పలువురి నటులు సహాయం అందించారు.
శరణ్య కోలుకుంటారన్న తరుణంలో ఆమెకు కరోనా వైరస్ సోకడంతో మరోసారి ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడింది. న్యుమోనియాతో పాటు రక్తంలో సోడియం స్థాయిలు పడిపోవడంతో కొన్ని రోజుల పాటు కేరళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శరణ్య(Saranya Sasi) చికిత్స పొందింది. సోమవారం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో శరణ్య రాత్రి కన్నుమూసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com