Edava Basheer : పాట పాడుతూ స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు..!

Edava Basheer : ప్రముఖ మలయాళీ గాయకుడు ఎడవ బషీర్ కన్నుమూశారు. ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. ఈ సంఘటన శనివారం (మే 28) రాత్రి 9:30 గంటలకు జరిగింది.
కేరళలోని అలప్పుజా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో... ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన మానే హో తుమ్ అనే హిందీ సాంగ్‌ను బషీర్ ఆలపిస్తుండంగా ఆయనకీ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీనితో కింద కూర్చోడానికి ప్రయత్నించి కిందపడిపోయారు.
87 ఏళ్ల బషీర్.. కేరళలోని తిరువనంతపురం జిల్లాకి చెందినవారు. ఈయనకి ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్, ఉషుస్ సీత్తా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com