తెలుగు చిత్ర సీమలో మరో మలయాళీ కుట్టి..

మలయాళ చిత్రసీమలో మంచి ప్రతిభావంతులలో సంయుక్త మీనన్ ఒకరు. 'తీవండి' చిత్రం ద్వారా ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బ్యూటీ మాలీవుడ్‌లో పాపులర్ స్టార్‌గా మారింది. 'లిల్లీ', 'కల్కి', 'వెల్లమ్', 'ఆనం పెన్నుమ్' వంటి చిత్రాలలో ఆమె నటన సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.
సంయుక్త మీనన్ చివరి చిత్రం 'ఆనుమ్ పెన్ను', ఇందులో ఆమె సఖవు సావిత్రి పాత్ర పోషించింది.
వికె ప్రకాష్ దర్శకత్వం వహించిన 'ఎరిడా' మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'కడువ' వంటి కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌లను సంయుక్త చేస్తోంది. త్వరలో రానున్న 'గాలిపట 2' చిత్రంతో ఆమె కన్నడలో అరంగేట్రం చేస్తుంది.
తెలుగు చిత్ర సీమలోకి కూడా కాలుపెడుతున్న సంయుక్త కళ్యాణ్ రామ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తవకముందే సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్ రైటింగ్స్, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మళయాళీ హీరోయిన్లకు మంచి ఆదరణే లభిస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలో. మరి సంయుక్త కూడా ప్రస్తుత తారలకు పోటీ ఇస్తుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com