Mallika Sherawat : నీకు సిగ్గు లేదా అన్నాడు : మల్లికా షెరావత్ సెన్సేషన్ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ రీసెంట్ గా సెన్సేషన్ కామెంట్స్ చేసింది. మర్డర్ సినిమాతో తనకు వచ్చిన పేరు, ప్రఖాత్యలపై స్పందించింది. ప్రత్యేకంగా రణవీర్ అల్లాబడియా పొడ్ క్యాస్ట్ చేసిన భీగే హోంత్ తేరే సాంగ్ గురించి రణవీర్ షోలో మాట్లాడింది. ఆ పాటా చాలా చక్కగా వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ షోలో ఓ న్యూస్ రిపోర్టర్ అడిగిన 'సిగ్గుపడటం' అంశం నటి స్పందించింది. ఆ ఘటన గురించి మల్లికా మాట్లాడుతూ.. ఆ "పాట విడుదలైనప్పుడు ఎంత 'కల్లోలం'' సృష్టించిందో తెలుసా? ఈ పాట సాహిత్యంతో తానెంతో సిగ్గుపడ్డాను. ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లాను. అక్కడ ఓ జర్నలిస్ట్ నాకు ఆ పాట సాహిత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు, అతను ఎక్కువగా 'ప్యార్' అనే పదాలపై దృష్టిపెట్టాడు. చివరికి అతను ‘ఆప్కో శరమ్ నహీ ఆయీ(మీకు సిగ్గు లేదా) అని నేను నేరుగా అన్నాడు, అప్పుడు నేను ‘నహీ ముఝ నహీ ఆయీ (లేదు, నాకు సిగ్గులేదు.)”అని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడని చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com