Mamata Kulkarni : డ్రగ్ డీలింగ్స్ వదిలేసి సన్యాసినిగా హీరోయిన్

ఆ పూల రంగూ నీ చీర చెంగూ.. అంటూ 90లలో ఓ పాట నిత్యం రేడియోస్ లోనూ టేప్ రికార్డర్ ఉన్న ప్రతి ఇంట్లోనూ వినిపించేది. ఆ పాటలో కనిపించిన అందం పేరు మమతా కులకర్ణి. చూడగానే కట్టిపడేసే అందం తన సొంతం. తమిళ్ మూవీతో కెరీర్ ప్రారంభించి వెంటనే తెలుగులో ప్రేమ శిఖరం, మోహన్ బాబు హీరోగా నటించిన దొంగ పోలీస్ చిత్రాల్లో నటించింది. ఈ రెండూ పెద్దగా ఆడలేదు.తర్వాత ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. అప్పుడప్పుడూ కన్నడ, బెంగాలీ మూవీస్ లోనూ మెప్పించింది. కాకపోతే తన అందం, ప్రతిభకు తగ్గట్టుగా పెద్ద స్టార్డమ్ రాలేదు. 2003లో సినిమా కెరీర్ కు గుడ్ బై చెప్పిన మమతా కులకర్ణి అసలు రూపం ఆ తర్వాతే అందరికీ తెలిసింది.
సినిమాల్లో అందమైన హీరోయిన్ గా కనిపించిన మమతా రియల్ లైఫ్ లో మాత్రం విలన్ గా కనిపించింది. తను విక్కీ గోస్వామి అనే డ్రగ్ లార్డ్ తో చేతులు కలిపింది. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను డీల్ చేసేందుకు అతనితో కలిసి 2016 కెన్యాలో ఓ మీటింగ్ లో పాల్గొంది. పోలీస్ లు వారి చర్యలపై నిఘా పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు.ఆమె ఇంటి తలుపులకు థానే పోలీస్ లు ఆమెకు నోటీస్ లు పంపించారు. అయినా నో రెస్పాన్స్. దీంతో మమమతో పాటు విక్కీ గోస్వామి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తెర మరుగయ్యాక డ్రగ్ డీలింగ్స్ అంటూ ఇంత తతంగం నడిపిన మమతా కులకర్ణి ఇప్పుడు తీరిగ్గా సన్యాసం తీసుకుని పాపాలు కడిగేసుకున్నట్టుగా ఫోజులు కొడుతోందంటున్నారు కొందరు.
ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న కుంభమేళాలో కిన్నార్ అఖాడాలో ఇహలోక వాంఛలన్నీ పరిత్యజించి సన్యాసినిగా మారింది. ఈ మేరకు కిన్నార్ అఖాడాలు ఆమెకు 'మాయీ మమతానంద్ గిరి' అనే కొత్త పేరును తగిలించారు. అంటే ఇక మమత మాతగా పూజలు చేయడం.. అందుకోవడం చేయబోతోందన్నమాట. మరి ఈ మాటున ఇంకెన్ని ఇల్లీగల్ పనులు చేస్తుందో లేక నిజంగానే అన్నీ వదిలేసి స్వచ్ఛమైన సన్యాసినిగా ఉంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com