Dhanush : ధనుష్ మూవీలో మమ్మూట్టి

Dhanush :  ధనుష్ మూవీలో మమ్మూట్టి
X

ధనుష్ ఈ మధ్య వరుసగా మూవీస్ చేస్తున్నాడు. చాలా వేగంగా వాటిని పూర్తి కూడా చేస్తున్నాడు. మరోవైపు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఎలా చూసినా మోస్ట్ బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్య రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేశాడు. ఈ మూవీలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గానే చెప్పారు. శ్రీలీల పరాశక్తి డిజాస్టర్ అయిన తర్వాత కమిట్ అయిన మూవీ ఇది. సాయి పల్లవి.. ధనుష్ సరసన రెండో సినిమా చేస్తోంది. ‘డి55’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం అయిందీ మూవీ. అయితే ఈ చిత్రంలో మమ్మూట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు అని ప్రకటించింది టీమ్.

ధనుష్ మూవీలో మమ్మూట్టి అనేది బలమైన కంటెంట్ ఉన్న మూవీ అనేది తెలుస్తోంది. పైగా సాయి పల్లవి ఇలాంటి మూవీకి కమిట్ అవడం అంటే కంటెంట్ లో దమ్ము ఉంది అని కదా అర్థం. ఇక ఈ మూవీ కోసం మమ్మూట్టి 40 రోజులు కాల్షీట్ ఇవ్వబోతున్నాడట. 40 రోజులు అంటే సినిమాలో చాలా పెద్ద నిడివి ఉండే పాత్ర అనేది తెలిసిపోతుంది. ఆ మూవీ షూటింగ్ కు సంబంధించిన పోర్షన్ ను ఈ నెలాఖరు నుంచే ప్రారంభించబోతున్నారు. మమ్మూట్టి మూవీస్ అంటే చాలా వేగంగా పూర్తి చేస్తాడు కాబట్టి.. ఇన్ని డేస్ అంటే చాలా పెద్ద సినిమానే. మొత్తంగా ధనుష్ తో పాటు మమ్మూట్టి, సాయి పల్లవి, శ్రీలీల అంటూ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ కనిపిస్తోందీ మూవీలో. మరి కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story