అర్థరాత్రి గోడదూకి గౌతమి ఇంట్లోకి..

అర్థరాత్రి గోడదూకి గౌతమి ఇంట్లోకి..
సోమవారం రాత్రి ఆమె ఇంట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు

చెన్నైలోని కొట్టివక్కమ్ ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ నటి గౌతమ్ ఇంట్లోకి ఓ అపరిచిత వ్యక్తి ప్రవేశించాడు. సోమవారం రాత్రి ఆమె ఇంట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. గోడ పక్కన దాక్కుని ఉన్న అతడిని అదే ఇంట్లో పని చేస్తున్న సతీష్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నీలంకంరై పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అనుమానితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో అనేక విషయాలు వెల్లడించాడు.

అతడిని కొట్టివాక్కం కుప్పం ప్రాంతానికి చెందిన పాండియన్‌గా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని తెలుసుకున్నారు. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించాడని అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం పాండియన్‌ను బెయిల్‌పై విడుదల చేశారు.

Tags

Next Story