జీవితం నీటి బుడగలాంటిది: యాంకర్ ఎమోషనల్ పోస్ట్

నటి, యాంకర్ ఝాన్సీ మేనేజర్ శ్రీను 35 ఏళ్లకే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. శ్రీను చిన్న వయసులోనే గుండెపోటుకు గురై ఇలా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం తనను అత్యంత బాధించిందని ఎమోషనల్ అయ్యారు. తనకు హెయిర్ డ్రెస్సర్ గా పని చేయడం మొదలు పెట్టి ఇప్పుడు తన మేనేజర్ గా ఉన్నాడని, చాలా మంచి వ్యక్తి, సహృదయుడు, తన కుటుంబసభ్యుల్లో ఒకడిగా కలిసి పోయాడని, అలాంటి వ్యక్తి ఇలా దూరమవడం తనను చాలా బాధించిందని ఝాన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
అతను సౌమ్యుడు, దయగలవాడు, చమత్కారమైన హాస్యం కలవాడు. ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నాకు చాలా బాధ కలిగించింది అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. జీవితం నీటి బుడగ లాంటిది. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అని పేర్కొన్నారు.
మేనేజర్ శ్రీను అకాల మరణవార్త ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుడి కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com