Karteeka Deepam: డాక్టర్ బాబు ఏడ్చాడు.. అమ్మ హ్యాపీ: మంచు లక్ష్మి ట్వీట్

Karteeka Deepam Serial: బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ సీరియల్ కోసం సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఎదురు చూస్తుంటారు. అందులో నటిస్తున్న దీపకు ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.
టీఆర్పీ రేటింగ్స్ లో కూడా టాప్ లో ఉన్న కార్తీక దీపం సీరియల్ పై నటి మంచు లక్ష్మి ఆసక్తికరమైన కామెంట్ చేసింది. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు దీప కోసం మొదటి సారి చాలా బాధపడుతూ ఏడ్చాడట. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది అంటూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు మీరు కూడా వంటలక్క అభిమానియా అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ట్వీట్ కి స్పందించిన డాక్టర్ బాబు (నిరుపమ్) ఆ ట్వీట్ ని షేర్ చేస్తూ మంచు లక్ష్మికి థాంక్స్ చెప్పారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com