Manchu Manoj: మీ ఇష్టం రా.. అంతా మీ ఇష్టం: మంచు మనోజ్

Manchu Manoj (tv5news.in)
Manchu Manoj: సినీ రంగంలో పెళ్లిళ్లు, విడాకులు కామన్ అయిపోయాయి. అయినా ఇద్దరు వ్యక్తుల మనసులు కలవకపోతే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదనే పరిస్థితికి ఎవరూ అలవాటు పడలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత జీవితం వారిది.. మనకెందుకులే అనుకోకుండా సినిమా వారి విడాకులపై, రెండో పెళ్లిపై అనేక పుకార్లు పుట్టిస్తున్నారు కొందరు. అలాంటి వారికి మనోజ్ ఘాటు రిప్లై ఇచ్చాడు.
మంచు మనోజ్ 2015లో ప్రణతిని వివాహం చేసుకున్నాడు. నాలుగు సంవత్సరాల తర్వాత వారిద్దరు ఒకరికి ఒకరు కరెక్ట్ కాదు అనుకుని ఇద్దరి ఇష్ట ప్రకారమే విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. అప్పటినుండి పర్సనల్‌గానే కాదు, ప్రొఫెషనల్‌గా కూడా మనోజ్ ప్రేక్షకులతో పెద్దగా టచ్‌లో ఉండట్లేదు. తాజాగా మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడని, ఇప్పటికే ఒక ఫారెన్ అమ్మాయితో లవ్‌లో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. దానికి మనోజ్ స్పందించాడు.
మనోజ్ రెండో పెళ్లి రూమర్స్‌ను రాసిన వెబ్‌సైట్‌ను తన ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ వారికి సమాధానం చెప్పాడు మనోజ్. 'పెళ్లికి నన్ను కూడా పిలవండి.. పెళ్లి ఎక్కడ? ఇంతకీ పిల్ల ఎవరు. బుజ్జి పిల్లా.? తెల్ల పిల్లా? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం' అంటూ క్యాప్షన్ పెట్టి ఒక ఫన్నీ మీమ్ స్టైల్‌లో మనోజ్ వారికి రిప్లై ఇచ్చాడు.
https://t.co/HntEosyeYv please invite me too … where is the wedding and who is that Bujji pilla Thella pilla ?! 😜😂 me istam ra anthaaa me istam 🤪 pic.twitter.com/q8nKADpxxf
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 26, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com