సినిమా

Manchu Manoj: ఆ నటుడిపై మంచు మనోజ్ ఫైర్.. ఏ లక్ష్యం లేకుండా ఉన్నాడంటూ..

Manchu Manoj: ఒక వ్యక్తి మాత్రం తమ అన్నను టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బందిపెట్టాలని చూశాడని స్పష్టం చేశాడు మనోజ్.

Manchu Manoj (tv5news.in)
X

Manchu Manoj (tv5news.in)

Manchu Manoj: కొంతకాలం క్రితం సినీ పరిశ్రమలో జరిగిన 'మా' ఎన్నికలు.. రాజకీయాలను తలపించాయి. మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ అనే ఈ పోరులో దాదాపు తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్లంతా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలిచాడు. అయితే ఇప్పటివరకు ఈ ఎన్నికల గురించి ఏ మాత్రం స్పందించని మంచు మనోజ్ మొదటిసారి మాట్లాడాడు.

మంచు ఫ్యామిలీలో ఎక్కువగా బయటకు రాకుండా.. పర్సనల్ విషయాలకంటే సామాజిక విషయాలపై ఎక్కువ దృష్టిపెట్టే నటుడు మంచు మనోజ్. మా ఎన్నికల సమయంలో కూడా మనోజ్ అంతగా యక్టివ్‌గా లేడు. మంచు విష్ణు, మోహన్ బాబు మాత్రమే మా ఎన్నికల ప్రచారం సమయంలో కానీ, ఓటింగ్ సమయంలో కానీ కలిసి యాక్టివ్‌గా పాల్గొన్నారు.

మంచు మనోజ్ ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ తన అన్నను ఒక వ్యక్తి టార్గెట్ చేస్తున్నాడని సెన్సేషనల్ కామెంట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఉన్నతస్థాయి విలువుల కలిగి ఉండాలని, జీవిత లక్ష్యం కంటే కూడా అది ఎంతో గొప్పదని అన్నాడు మనోజ్. అది లేకపోతే మనిషి తనను తాను నాశనం చేసుకుంటాడని తెలిపాడు.

ఈ విషయాన్ని వివరంగా చెప్తూ మనోజ్.. మా ఎన్నికల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. ఆర్టిస్టులంతా విష్ణు ప్రెసిడెంట్ కావాలని భావించినందుకే ఓట్లు వేసి గెలిపించారని గుర్తుచేసుకున్నాడు. పరిశ్రమలో అందరి మధ్య మంచి అనుబంధం ఉన్నా.. ఒక వ్యక్తి మాత్రం ప్రతీసారి తమ అన్నయ్యను టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బందిపెట్టాలని చూశాడని స్పష్టం చేశాడు మనోజ్.

మా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి.. తమకు సపోర్ట్ చేసినవారిని వయసుతో సంబంధం లేకుండా ఎన్నో మాటలు అన్నాడని చెప్పుకొచ్చాడు మనోజ్. ఆ వ్యక్తి చుట్టూ గొప్పవాళ్లు ఉన్నా.. తను మాత్రం ఏ లక్ష్యం లేకుండా జీవిస్తున్నాడని పరోక్షంగా ఒకరి గురించి మాట్లాడాడు మనోజ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ అవ్వడంతో పాటు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని అనుమానాలు కూడా మొదలయ్యాయి.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES