Manchu Manoj : మంచు మనోజ్ అత్తరు సాయిబు

Manchu Manoj :  మంచు మనోజ్ అత్తరు సాయిబు
X

ఒకప్పుడు హిట్టూ, ఫ్లాపులతో పనిలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయాడు మనోజ్. కానీ అదే పనిగా ఫ్లాపులు వస్తుండటంతో బ్రేక్ తీసుకున్నారు. ఈ లోగా పర్సనల్ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. విడాకులు తీసుకున్నాడు. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఫ్యామిలీలో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. ఓ వైపు ఓ గొడవలు ఫేస్ చేస్తూనే మరోసారి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా అతను ఒక హీరోగా నటించిన భైరవం చిత్రం ఈ నెల 30న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా వచ్చిన భైరవం ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఏడేళ్ల తర్వాత వెండితెరపైకి వస్తోన్న మనోజ్ కు మంచి కమ్ బ్యాక్ మూవీ అయ్యేలా కనిపిస్తోంది.

ఇక దీంతో పాటు తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న ‘మిరాయ్’లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అతని పాత్రకు సంబంధించిన ఇంటర్డక్షన్ వీడియోకే ఓ రేంజ్ అప్లాజ్ వచ్చింది. మిరాయ్ ని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంతో మనోజ్ విలనీ దేశవ్యాప్తంగా కనిపించబోతోంది. వీటితో పాటు తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యాడు మనోజ్. ఈ సారి తనే హీరోగా నటించబోతున్నాడు.

గతంలో కార్తీకేయతో 90ఎమ్.ఎల్ అనే మూవీ రూపొందించిన శేఖర్ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రానికి ‘అత్తరు సాయిబు’అనే టైటిల్ పెట్టారట. ఇలాంటి టైటిల్స్ మనోజ్ కు బానే సెట్ అవుతాయి. కాస్త ఫంకీగా ఉండే పాత్రల్లో అతను బాగా ఆకట్టుకుంటాడు. సో.. ఇక నటనపై దృష్టి పెట్టి దూకుడు పెంచాడు మనోజ్ అనుకోవచ్చు.

Tags

Next Story