Manchu Manoj: 'కరోనా హానికరం కాదు' అన్న నెటిజన్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన మనోజ్..

Manchu Manoj (tv5news.in)
Manchu Manoj: మంచు మనోజ్ ఇటీవల కరోనా బారిన పడ్డాడు. ఇదే విషయాన్ని తాను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. అయితే అతడు ఆస్పత్రిలో ఉన్నారా లేదా హోం క్వారంటైన్‌లో ఉన్నారా అన్న విషయం వెల్లడించలేదు. కానీ తాను బాగానే ఉన్నానని అభిమానులను ఆందోళన చెందవద్దని తెలిపాడు. తనకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. గత వారంలో తనను కలిసిన ప్రతి ఒక్కరిని కోవిడ్ పరీక్షలు చేయించుకోమని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోమని అన్నాడు.
అయితే కరోనా నుండి ప్రపంచం ఫ్రీ అయిపోయిందని.. ఇక దాని వల్ల ఏమీ హాని ఉండదని అనుకుంటున్న సమయంలోనే కేసులు పెరగడం మొదలయ్యింది. అంతే కాకుండా ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ అనే వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తూ ప్రజలను భయపెడుతోంది. కానీ ఇంకా చాలామంది దీనిని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టలేదు. అలాంటి వారిలో ఒకరికి మనోజ్ మంచి కౌంటర్‌నే ఇచ్చాడు.
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా కూడా మనోజ్ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనే చూస్తాడు. అంతే కాకుండా ఎవరైనా తన పోస్ట్‌కు కౌంటర్ వేస్తే దానికి రివర్స్ కౌంటర్ కచ్చితంగా ఇస్తాడు. అలాగే మనోజ్‌కు కరోనా వచ్చిందన్న పోస్ట్‌కు ఓ నెటిజన్ 'అది ఇప్పుడు అంత ప్రమావకరం కాదు. గెట్ వెల్ సూన్' అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి మనోజ్ 'అయితే రా చెస్ ఆడుదాం' అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ కౌంటర్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్.. మనోజ్ కామెడీ టైమింగ్‌ను మెచ్చుకుంటున్నారు.
Then come let's play chess 😜😂 https://t.co/5Qi7ZDmcie
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 29, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com