Manchu Manoj : మంచు మనోజ్ కు షాక్ ఇచ్చిన సొంత తల్లి

మంచు మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కొన్నాళ్లుగా ఆ ఇంట్లో జరుగుతోన్న సంఘటనల వల్ల ఈ వయసులో మోహన్ బాబు కోర్ట్ మెట్లు ఎక్కబోతున్నాడు. పోలీస్ స్టేషన్ లో కేస్ లు నమోదయ్యాయి. ఇటు మీడియా వారికీ ప్రమాదాలు తప్పడం లేదు. ఈ క్రమంలో మంచు మనోజ్ వర్సెస్ విష్ణు మంచుగా ఉన్న పంచాయితీలో ఇప్పటి వరకూ మనోజ్ ది కాస్త పై చేయిగా కనిపించింది. చాలామందికి అతనిపై సింపతీ కురిపిస్తున్నారు. తాజాగా తన ఇంట్లో కరెంట్ చేయడానికి విష్ణు జనరేటర్ లో పంచదార పోశాడు అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు మనోజ్. అంతే కాదు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టాడట కూడా. అది నిజమే అనుకుని చాలామంది విష్ణుపై విమర్శలు చేశారు. బట్ అది పాత వీడియో అని.. అందులో విష్ణు ఏ తప్పూ చేయలేదనీ ఈ విషయంలో మనోజ్ పెట్టిన కేస్ ను పట్టించుకోవద్దని చెబుతూ మనోజ్ తల్లి, మోహన్ బాబు భార్య మంచు నిర్మల అదే స్టేషన్ లో మరో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో ఇప్పటి వరకూ తనకు తల్లి మద్ధతు ఉందని భావిస్తోన్న మనోజ్ కు షాక్ తగిలింది. మరోవైపు అతను వెయ్యి కార్లతో నంద్యాల వెళ్లి అక్కడ జనసేన పార్టీలో చేరతాడు అని మూడు రోజులుగా మీడియాలో హడావిడీ కనిపించింది. బట్.. అదేం లేదు. జస్ట్ పది కార్లు వేసుకుని తన అత్త భూమా శోభానాగిరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో ఆ వార్తలు ఆ క్యాంప్ నుంచే వచ్చాయి కాబట్టి నిజమే అని నమ్మిన జనం వార్నీ.. ఇదంతా మీడియా అటెన్షన్ కోసం మనోజ్ ఆడిన డ్రామా అని తెలిసి విమర్శలు గుప్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com