MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్‌లో సభ్యులెవరంటే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు అని తెలియడానికి ఎక్కువకాలం లేదు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పటి నుండి అవి ఎన్నోసార్లు వాయిదా పడ్డాయి. చిట్టచివరగా అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయించింది. అప్పటి నుండి అందుకోసం పోటీపడుతున్న సభ్యులు వారు గెలవడం కోసం తెలివిగా పావులు కదుపుతున్నారు.
ఇప్పటివరకు ఉన్న పరిస్థితి చూస్తే మిగతా పోటీదారులతో పోలిస్తే ప్రకాశ్ రాజ్‌కే సపోర్ట్ ఎక్కువగా లభిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే విష్ణు కూడా తనకు గట్టి పోటీ ఇవ్వడానికి చాలా తెలివిగా తన ప్యానల్ సభ్యులను ఎంచుకున్నడు. తాజాగా తన ప్యానల్‌ను ప్రకటించాడు మంచు విష్ణు.మంచు విష్ణు ప్యానల్ లో అధ్యక్షుడిగా మంచు విష్ణునే పోటీచేస్తుండగా ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్ వ్యవహరించనున్నారు.
జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్ లాంటి సీనియర్లను బరిలోకి దింపాడు విష్ణు. అంతే కాకుండా ఇందులో ట్రెజరర్‌గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్ రాజులను ఎంపిక చేసాడు. ఇక మంచు విష్ణు ప్యానల్ ఈసీ సభ్యుల విషయానికొస్తే.. అర్చన, సంపూర్ణేశ్ బాబు, అశోక్‌కుమార్, .గీతాసింగ్, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, .శ్రీనివాసులు, స్వప్నా మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఇందులో చోటు దక్కించుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com