MAA President Manchu Vishnu: 17 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు

MAA President Manchu Vishnu: ఒకప్పుడు మూవీ ఆర్టిస్టులకు ఒక అసోసియేషన్ ఉండేదని.. దాని పేరే 'మా' అని కూడా ఎవరికీ తెలీదు. పది సంవత్సరాల క్రితం మాకు ఇన్ని హంగులు ఆర్భాటాలు లేవు. జూనియర్ ఆర్టిస్టులను, క్యారెక్టర్ ఆర్టిస్టులను సపోర్ట్ చేయడానికి మా మొదలయ్యింది. అందులోని సభ్యులు వారి ఇష్టప్రకారం తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎంపిక చేసేవారు. మెల్లగా దానికి ఓటింగ్ విధానం మొదలయింది. ఇక ఇప్పుడు మా ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది చిన్నగా మొదలయిన ఒక సంస్థ. అది మెల్లగా తన పరిధిని పెంచుకుంటూ టాలీవుడ్ ఆర్టిస్టులందరినీ తనలో కలిపేసుకుంది. పదేళ్ల క్రితం కూడా మా ఉంది. అప్పుడు దానికి మోహన్ బాబు అధ్యక్షుడిగా ఉన్నారు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం 2004 అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మోహన్ బాబు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. మళ్లీ సరిగ్గా అదే రోజున ఇప్పుడు మా ఎన్నికలు జరగాయి.
ఈసారి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేశాడు. కానీ అప్పట్లో మోహన్ బాబుకు పోటీగా ఎవరూ లేరు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఇప్పుడు మంచు విష్ణుకి పోటీగా ప్రకాష్ రాజ్ బరిలో నిలిచారు. ఇద్దరి మధ్య చివరి నిమిషం వరకు హోరాహోరీ పోరు సాగింది. ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ మధ్య మంచి మెజారిటీతో విష్ణు గెలిచినట్టుగా వెల్లడైంది. 17 ఏళ్ల ముందు తండ్రి.. 17 సంవత్సరాల తర్వాత కొడుకు ఒకేరోజున ' మా ' కు అధ్యక్షులుగా ఎంపికవ్వడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com