Manchu Vishnu: చాలాకాలం తర్వాత హీరోగా మంచు విష్ణు.. సరికొత్త పాత్రలో..

Manchu Vishnu (tv5news.in)

Manchu Vishnu (tv5news.in)

Manchu Vishnu: మంచు విష్ణు తన కెరీర్ ప్రారంభంలోనే కొన్ని కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Manchu Vishnu: మంచు ఫ్యామిలీకి టాలీవుడ్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో ప్రతీ నటుడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ఫ్యామిలీ నుండి వచ్చే సినిమాలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల క్రితం వరకు మా ఎన్నికల విషయంలో బిజీగా ఉంది మంచు ఫ్యామిలీ. ఇప్పుడు అవి పూర్తయ్యి మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీంతో ఒక్కొక్కరు మళ్లీ సినిమాలవైపు అడుగులేస్తున్నారు.

మంచు విష్ణు తన కెరీర్ ప్రారంభంలోనే కొన్ని కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'ఢీ'లాంటి చిత్రాలు తన కెరీర్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా మిగిలిపోయాయి. అయితే కొంతకాలంగా తన సినిమాలతో ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోతున్నాడు విష్ణు. అందుకే ఓ కొత్త ప్రయోగంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


మంచు విష్ణు కేవలం కమర్షియల్ సినిమాలే కాదు.. అందులో కామెడీ కూడా చేసేవాడు. విష్ణు కామెడీకి కూడా అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే చాలాకాలం తర్వాత అలాంటి ఓ కామెడీ పాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడు విష్ణు.

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో వస్తు్న్న చిత్రంలో గాలి నాగేశ్వరరావుగా కనిపించనున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించనున్నాడు. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి విష్ణు తన ట్విటర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story