Manchu Vishnu: మంచు విష్ణు సరసన ఇద్దరు హాట్ బ్యూటీలు.. సన్నీ లియోన్‌తో పాటు..

Manchu Vishnu: మా ఎన్నికల తర్వాత మంచు విష్ణు పేరు టాలీవుడ్‌లో ఇంతకు ముందుకంటే ఎక్కువగా మారుమోగిపోతోంది. సినిమాలకంటే ఎక్కువగా మూవీ పాలిటిక్స్ వల్లే ఆయన పేరు వైరల్‌గా మారుతోంది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ వచ్చినా కూడా మంచు విష్ణు మాత్రం అవేవి పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీని అనౌన్స్ చేశాడు మంచు విష్ణు.
విష్ణు కామెడీకి కూడా అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే చాలాకాలం తర్వాత అలాంటి ఓ కామెడీ పాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడు విష్ణు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో గాలి నాగేశ్వరరావుగా కనిపించనున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించనున్నాడు. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి విష్ణు తన ట్విటర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాలో ఇద్దరు హాట్ బ్యూటీలు ఉండబోతున్నారన్న వార్త వైరల్‌గా మారింది. అయితే అందులో ఒకరు పాయల్ రాజ్‌పుత్ కాగా.. మరొకరు సన్నీ లియోన్ అని సమాచారం. అయితే టాలీవుడ్‌కు సన్నీ లియోన్‌ను తీసుకొచ్చిందే మంచు ఫ్యామిలీ. సన్నీ లియోన్ ఐటెమ్ సాంగ్స్ చేయడం కాకుండా నటిగా కూడా చిన్న పాత్ర చేసింది ఒకేఒక్క తెలుగు సినిమాలో. అదే మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ'.
ఇదివరకు తమ్ముడితో జోడీ కట్టిన సన్నీ లియోన్.. ఇప్పుడు అన్న మంచు విష్ణుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోనుందని వార్త వైరల్‌గా మారింది. ఒకవైపు సన్నీ లియోన్, మరోవైపు పాయల్ రాజ్‌పుత్.. ఇద్దరికీ టాలీవుడ్‌లో మంచి పేరుంది. వీరిద్దరు ఇప్పుడు మంచు విష్ణుతో మూవీ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఈ వార్తల్లో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com