సినిమా

Manchu Vishnu: బాలయ్యతో భేటీ బావుంది.. ఏం మాట్లాడుకున్నామంటే.. : మంచు విష్ణు

Manchu Vishnu: బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది.

Manchu Vishnu: బాలయ్యతో భేటీ బావుంది.. ఏం మాట్లాడుకున్నామంటే.. : మంచు విష్ణు
X

Manchu Vishnu: 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఇండస్ట్రీలోని పెద్దలందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకుంటూనే 'మా'కు ఏమేం చేయాలో చర్చిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన బాలయ్యను తండ్రి మోహన్ బాబుతో వెళ్లి కలిశారు. మా అభివృద్ధి, మా కోసం ఓ భవనం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు.

భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. గత ఎన్నికల్లో లోకేశ్ ఓటమికి ప్రచారం చేశా.. అయినా అవేమీ పట్టించుకోకుండా మా ఎన్నికల్లో విష్ణుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి గెలిపించారు. మా భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా నిలుస్తానని మాటిచ్చారు.

విష్ణు మాట్లాడుతూ.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కలుస్తానని చెప్పారు. ఈ నెల 16న మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న శుభసందర్భంలో ఇండస్ట్రీలోని పెద్ధలందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కైకాల సత్యన్నారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశానని చెప్పారు.

Next Story

RELATED STORIES