ఒకే కుటుంబంగా అన్ని చిత్ర పరిశ్రమలు: మంచు విష్ణు
దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను కలిపేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఒక అడుగు ముందుకు వేసింది. ఇందుకు గాను ముందుగా హిందీ ఇండస్ట్రీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి వారికి అక్క సభ్యత్వాలు, అక్కడి వారికి ఇక్కడి సభ్యత్వాలు ఇవ్వనున్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు హిందీ చలనచిత్రం అసోసియేషన్ అధ్యక్షుడు కలిసి ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. విష్ణు, శివ బాలాజీ కలిసి జూన్ 17న ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో కలిశారు. రెండు అసోసియేషన్ లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతిపాదన ఉంచారు. అందుకు హిందీ పరిశ్రమ అంగీకారం తెలిపింది.
మా ప్రెసిడెంట్ విష్ణు మాట్లాడుతూ "మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, బాలీవుడ్ అసోసియేషన్‌ల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాల్లో పని చేసే బాలీవుడ్ కళాకారులకు “మా” సభ్యత్వం అందుతుంది. అలాగే మన తెలుగు నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తే వాళ్ళకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం అందుతుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే 'మా' వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయని తెలిపారు. ఈ ఒప్పందంతో మన తెలుగు నటీనటులకు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. త్వరలోనే వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుందని, అన్ని ఇండస్ట్రీలు ఓకే కుటుంబంగా ఉండాలి" అని విష్ణు మంచు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com