Maa Elections 2021 Results: పోస్టల్ బ్యాలెట్‌లో మంచు విష్ణు ప్యానల్‌దే మెజార్టీ.. ఎలాగంటే..

Maa Elections 2021 Results: మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నదానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. దీంతో వాటిని పక్కన పెట్టారు. ఒక్కో ఓటును చూస్తున్నంతసేపు.. అభ్యర్థుల మొహాల్లో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు.
పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు ప్యానల్ కు మెజార్టీ వచ్చింది. నిజానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అంతకుముందు వివాదం నెలకొంది. దీనికి సంబంధించి గోల్ మాల్ జరిగిందని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపించింది. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేసింది. సభ్యులకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలు కూడా చేసింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి పడతాయా అన్న ఉత్కంఠ మొదటి నుంచి నెలకొంది. ఎందుకంటే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేవారిలో వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారే ఎక్కువగా ఉంటారు. అలాంటివారు ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ఓటేయలేని పరిస్థితి. అందుకే వారికి ఈ సదుపాయాన్ని కల్పించారు.
సభ్యుల విజయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇవి మొత్తం 60 ఓట్లు పోలయ్యాయి. ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా గెలుపు గెలుపే. అందుకే రెండు ప్యానళ్లు.. దీనిపై గట్టిగానే ఫోకస్ పెట్టాయి. చివరకు మంచు విష్ణు ప్యానల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిపత్యం సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com