MAA President Manchu Vishnu: మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి వారు రాలేదు..

MAA President Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ప్రకాశ్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు రేసులో అధిక మెజారిటీ గెలుచుకున్న మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ఇటీవల సీనియర్ ఆర్టిస్టులకు ఫించను అందించే విషయంలో చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడిగా ఫైల్‌పై తన మొదటి సంతకాన్ని పెట్టారు విష్ణు. తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో 'మా' నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'మా' కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్స్ ఒకరిని ఒకరు ధూషించుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మొత్తం మా కు రాజీనామా చేసింది. ఆ ఎఫెక్ట్ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా కనిపించింది. ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి ఒక్క సభ్యుడు కూడా హాజరు కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com