టాప్‌లెస్‌లో ఆర్‌ఎక్స్ బ్యూటీ.. మంగళవారం ఫస్ట్‌లుక్

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి 'మంగళవారం' పేరుతో పాన్ సౌత్-ఇండియన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ ఆవిష్కరించింది. టాప్‌లెస్‌గా ఉన్న పాయల్ తన లుక్స్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్దమవుతోంది. దర్శకుడు అజయ్ ఆమె పాత్ర పేరును కూడా వెల్లడించారు. ఆమె శైలజ. “శైలూ... చాలా కాలం పాటు మీ గుండెల్లో నిలిచిపోతారు. మా కొత్త చిత్రం మంగళవారంలో ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో పాయల్ కనిపిస్తారు అని రాసుకొచ్చారు.
పాయల్ తన హాటెస్ట్ లుక్‌ను పంచుకుంటూ, "మీరు చూడగలిగితే లుక్ చాలా చెబుతుంది" అని పోస్ట్ చేసింది. దర్శకుడు అజయ్‌తో పాయల్ మరోసారి కలిసి పనిచేయడంతో ఈ చిత్రంపై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకునే విధంగా రూపొందించడంతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని టీమ్ భావిస్తోంది. 'కాంతారా' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ 'మంగళవారం' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అజనీష్ సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రానికి కూడా సంగీతం అందించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com