Sai Pallavi : సాయిపల్లవితో సినిమా చేయాలనుంది : మణిరత్నం

హీరోయిన్ సాయిపల్లవిపై లెజండరీ డైరెక్టర్ మణిరత్నం పొగడ్తల వర్షం కురిపించారు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘అమరన్’. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మణిరత్నం మాట్లాడుతూ.. తాను సాయిపల్లవికి పెద్ద అభిమానిని చెప్పారు.ఆమెతో సినిమా చేయాలనుంది. తప్పకుండా చేస్తా' అని అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మణిరత్నం దర్శకత్వంలో నటించాలని హీరోయిన్లందరూ కలలు కంటుంటారు. కానీ, ఓ హీరోయిన్ తో పనిచేయాలనుందని మణిరత్నం చెప్పటం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com