Sai Pallavi : సాయి పల్లవిపై మణిరత్నం సెన్సేషనల్ కామెంట్స్

Sai Pallavi :  సాయి పల్లవిపై మణిరత్నం సెన్సేషనల్ కామెంట్స్
X

మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడిని ఇండియాలో మరొకరిని చూడలేం. సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్నా.. ఆయన టేకింగ్, మేకింగ్, స్టోరీ టెల్లింగ్ ఎన్నో తరాలకు ఓ లైబ్రరీ లాంటిది. దేశం మొత్తం గర్వించే సినిమాలెన్నో రూపొందించిన దర్శకుడాయన. అలాంటి దర్శకుడు నిన్నకాక మొన్నొచ్చిన సాయి పల్లవి గురించి సంచనంగా మాట్లాడటం చూసి ఎంటైర్ సౌత్ షాక్ అవుతోంది.

ప్రస్తుతం సాయి పల్లవి తమిళ్ లో అమరన్ అనే సినిమా చేసింది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు మణిరత్నం, లోకేష్ కనకరాజ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలోనే ఆయన సాయి పల్లవి గురించి చెప్పిన మాట సెన్సేషనల్ అయింది. అంత పెద్ద దర్శకుడు.. సాయి పల్లవికి చెబుతూ.. ‘నేను నీకు పెద్ద అభిమానిని. ఏదో ఒక రోజు నీతో వర్క్ చేస్తానని ఆశిస్తున్నాను’.. అన్నాడు. ఈ మాటలు అక్కడున్న వారందరినీ షాక్ కు గురి చేశాయి. ఎంతోమంది లెజెండరీ ఆర్టిస్టులతో పనిచేసిన మణిరత్నం సాయి పల్లవికి అభిమానని అని చెప్పడం ఆశ్చర్యం కాక మరేంటీ..?

తర్వాత సాయి పల్లవి కూడా ఆయన గురించి అదే రేంజ్ లో పొగిడింది. బట్ ఈమె ఎంతైనా పొగడొచ్చు. బట్ మణిరత్నం అలా చెప్పడం మాత్రం గ్రేట్ అనే అంటున్నారు చూసిన వాళ్లంతా. విశేషం ఏంటంటే.. కార్తీతో మణిరత్నం రూపొందించిన ‘చెలియా’ అనే సినిమాలో ముందుగా సాయి పల్లవినే అప్రోచ్ అయ్యాడు. బట్ ఆ మూవీలో కిస్ సీన్స్ తో పాటు సెమీ అడల్ట్ సీన్స్ కూడా ఉండటంతో తను నో చెప్పింది. మరి మణిరత్నం కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Tags

Next Story