Srinath Bhasi : మంజుమ్మేల్ బాయ్స్ నటుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

రీసెంట్ గా వచ్చిన మళయాల బ్లాక్ బస్టర్ మంజుమ్మేల్ బాయ్స్ లో నటించిన శ్రీనాధ్ భాసిని ఓ యాక్సిడెంట్ కేస్ లో కేరళ పోలీస్ లు అరెస్ట్ చేశారు. కేరళలోని కుందన్నూర్ ప్రాంతంలో శ్రీనాథ్ తన కార్ లో వెళుతూ మహ్మద్ ఫహీమ్ అనే బైకర్ ను ఢీ కొట్టాడు. అతనికి దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా అసలేం పట్టించుకోకుండా అలాగే వెళ్లిపోయాడు శ్రీనాథ్. ఈ సంఘటనను స్వయంగా చూసిన వాళ్లు పోలీస్ లకు కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు.. ఆ ప్రమాదం జరిగినప్పుడు కార్ నడుపుతున్నది శ్రీనాథే అని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనాథ్ తో పాటు మరో నటి ప్రయాగ మార్టిన్ కూడా ఉందట. అయితే ఈ ప్రమాదానికి కారణం.. అతివేగం అని గుర్తించారు. దీంతో పాటు ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగి శ్రీనాథ్ లైసెన్స్ ను నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే ఇది ఇంతటితో అయిపోలేదు. ఈ యాక్సిడెంట్ కు కారణం శ్రీనాథ్ డ్రగ్స్ తీసుకుని ఉండటమా అనే కోణంలో పోలీస్ లు దర్మాప్తు చేశారు. అందుకు మరో కారణం కూడా ఉంది.
కుందన్నూర్ ప్రాంతంలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ ఓమ్ ప్రకాష్ ఆ ప్రమాదం జరిగిన టైమ్ లోనే ఓ పెద్ద పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా వాడారని పోలీస్ లకు సమాచారం ఉందట. దీంతో శ్రీనాథ్ తో పాటు నటి ప్రయాగ కూడా డ్రగ్స్ తీసుకుని ఉన్నారా అని అన్ని టెస్ట్ లూ చేశారు. అదృష్ట వశాత్తు అలాంటిదేం లేదని తేలింది. మరోవైపు ఈ కేస్ లో శ్రీనాథ్ కు వెంటనే బెయిల్ వచ్చింది. అలాగే ప్రమాదానికి గురైన వ్యక్తికి కూడా ప్రాణాపాయం లేదని తేల్చారు.
మొత్తంగా వీరు కానీ డ్రగ్స్ తీసుకుని ఉంటే వారి కెరీర్, జీవితం మరోలా మారేవేమో కదా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com